పర్యాటక అభివృద్ధితో ఉపాధి
జన్నారం: పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆయా అటవీ ప్రాంతాల ను అభివృద్ధి చేసి గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలతోపాటు జన్నారం అటవీ డివిజన్ ఎంపిక చేసింది. ఆయాచోట్ల సఫారీ ప్రయాణం, అక్కడ మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరగడంతోపా టు గిరిజనులకు ఉపాధి అవకాశం ఉంటుంది. ఇందన్‌పల్లిలో ఇప్పటికే వెదురుతో కళావృత్తులపై శిక్షణ ఇస్తున్నారు. వెదురు కళాకండాలను పర్యాటకులు కొనుగోలు చేస్తే ఉపాధి లభించే అవకాశం ఉంది. అదేవిధంగా గైడ్‌లుగా, చిన్న హోటళ్లు నిర్వహించుకునే వీలుంటుంది.
అభివృద్ధికి దూరం
గత ఐదేళ్ల క్రితం జన్నారం అటవీ డివిజన్‌ను అటవీ శాఖ పర్యాటకంగా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత మరిచింది. ఏటా పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అక్టోబర్ నుంచి జూన్ వరకు సఫారీ ప్రయాణానికి అనుమతి, పర్యాటకుల నుంచి కొంత ఫీజు వసూళ్లు చేస్తోంది. ఇందులో భాగంగా జన్నారం డివిజన్ గొండుగూడ బేస్‌క్యాంపు, బైసన్‌కుంట, నీలుగాయి కుంట ప్రాంతాల్లో పర్యాటకులను సఫారీ ద్వా రా తిప్పేందుకు ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా జన్నారం డివిజన్ అధికారి పోస్టు ఖాళీ గా ఉండటం, నిధుల కొరతతో పర్యాటక ప్రదేశాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ఐదేళ్లలో చేసిన ఏర్పాట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి.
ఉపాధి లభిస్తుంది
అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు, వివిధ పక్షులు ఉంటాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి ప్రాంతాలు అభివృద్ధి జరిగితే గైడ్స్, డ్రైవర్ల నియామకం, గిరిజనులకు చిరు వ్యాపారాల ద్వారా ఉపాధి లభిస్తుంది. – వీరెందర్, మేనేజర్ పర్యాటక శాఖ
గోండుగూడ బేస్‌క్యాంప్
బైసన్‌కుంటలో విహరిస్తున్న విదేశీ డక్స్
పర్యాటక అభివృద్ధితో ఉపాధి
పర్యాటక అభివృద్ధితో ఉపాధి


