వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం
బాసర: హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి జాహ్నవి బంగారు పతకం సాధించింది. ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్ ఆదివారం ఆమెను అభినందించారు. అసోసియేట్ డీన్లు డా.ఎస్.విట్టల్, డా.కె.మహేశ్, శీలం శేఖర్, స్పోర్ట్స్ సెల్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జి ఎం.రామకృష్ణ పాల్గొన్నారు.
జాతీయస్థాయి పోటీలకు జిల్లా స్విమ్మర్
ఆదిలాబాద్: జిల్లా కేంద్రానికి చెందిన కొమ్ము చరణ్‌తేజ ఎస్జీఎఫ్ అండర్–17 స్విమ్మింగ్ పోటీల్లో జాతీయస్థాయి పోటీలకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఆదివారం నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు న్యూఢిల్లీలోని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్విమ్మింగ్ పూల్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటారు. 4x100 ఫ్రీ స్టైల్ రిలేపోటీల్లో చరణ్ తేజ్ పాల్గొననున్నట్లు స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కోచ్ కొమ్ము కృష్ణ తెలిపారు.
అండర్–14 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆది వారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అసో సియేషన్ అండర్–14 జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చి న 48 మందిని గుర్తించి, నాలుగు టీమ్‌లుగా ఏర్పాటు చేసినట్లు కోచ్ పి.ప్రదీప్ తెలిపారు. నాలుగు టీమ్‌ల మధ్య క్రికెట్ పోటీలు నిర్వహించి, అందులో ఉత్తమ ప్రదర్శన కనబర్చి న వారితో ఉమ్మడి జిల్లా టీమ్‌ను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. పీడీ గోపాల్, సీనియర్ క్రీడాకారులు చందు, తిరుపతి పాల్గొన్నారు.
వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం
వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం


