‘కలంస్నేహం’ ఆత్మీయ సమ్మేళనం
నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ఆదివారం ‘కలంస్నేహం’రాష్ట్రస్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి కవులు, కవయిత్రులు, గాయకులు, కళాకారులు పాల్గొని కవితలు, పాటలు వినిపించారు. వ్యవస్థాప అధ్యక్షుడు శ్రీమాన్ గోపాల్ ఆచార్య మాట్లాడుతూ కళలు మానసిక వికాసానికి దోహదపడతాయన్నారు. సమాజంలో చైతన్యం పెంపొందించే కవితలు రాయాలన్నారు. పూర్వకవులు రాసిన కవితలు చదవాలని ‘కలంస్నేహం’సాహితీవేదిక ద్వారా ఎంతోమంది కొత్త కవులకు మార్గనిర్దేశనం చేస్తున్నామని తెలిపారు. డా.అప్పాల చక్రధారి, నేరెళ్ల హనుమంతు, వాణిజ్యపన్నుల అధికారి గోదావరి, సాంఘికసంక్షేమ విద్యాలయ ప్రిన్సిపాల్ సుమలత, నిర్వాహకులు దేవి ప్రియ, కవులు, రచయితలు కడారి దశరథ్, కొండూరు పోతన్న, శ్యామలరాణి, తోట గంగాధర్, దేవిదాస్ పాల్గొన్నారు.


