● లైసెన్స్‌డ్ పిస్టళ్లు డిపాజిట్ చేయాలని పోలీస్ ఉన్న
మంచిర్యాలక్రైం: రామగుండం పోలీస్ కమి షనరేట్ పరిధిలో పంచాయతీ ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. సీపీ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడ మే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాలోని వివిధ వ్యక్తుల వద్ద ఉన్న లైసెన్స్‌డ్ తుపాకులను ఆయా పో లీస్‌స్టేషన్లలో అప్పగించాలని హెచ్చరికలు జారీ చే శారు. ఠాణాల పరిధిలోని పాత నేరస్తులు, రౌడీ షీ టర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ బైండోవర్ చేసేందుకు వారి జాబితా సిద్ధం చేశారు. మద్యం, డబ్బు ను కట్టడి చేసేందుకు బెల్ట్ షాపులపై దాడులు నిర్వహిస్తున్నారు, ఎక్కడికక్కడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, రామగుండం, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాలతోపాటు ఖానా పూర్ నియోజకవర్గ పరిధిలోని జన్నారం ఉన్నాయి. చెన్నూర్ నియోజకవర్గంలో కోటపల్లి, సిర్సా, అన్నా రం, అర్జునగుట్ట, నీల్వాయి, వేమనపల్లి ప్రాంతాలు మావోలకు పెట్టిన కోటగా పేరుంది. ఇటీవల జరిగి న ఎన్‌కౌంటర్లు, మావోల లొంగుబాటుతో జిల్లాలో మావోయిజం మసకబారినట్లు చర్చ జరుగుతోంది.
‘సరిహద్దు’లో ప్రత్యేక నిఘా
ప్రాణహితకు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలు కావడంతో పోలీసులు అక్కడి గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో 306 గ్రామపంచాయతీలకు గాను 83 పంచాయతీలను పోలీస్‌శాఖ అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించింది. ఆయా పంచాయితీల్లో ప్ర త్యేక నిఘా పెట్టింది. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘ టనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు భారీ బందోబస్తు ఏ ర్పాటు చేశారు. జిల్లాలో ఒకటి అంతర్రాష్ట్ర, నాలుగు అంతర్ జిల్లా చెక్ పోస్టులున్నాయి. కోటపల్లి మండలం నుంచి ప్రాణహిత నది మీదుగా మహారాష్ట్ర రోడ్డు మార్గంలో అంతర్రాష్ట్ర వారధి ఉండడంతో పార్‌పెల్లి సమీపంలో అంతర్‌ర్రాష్ట్ర చెక్‌పోస్ట్ ఏర్పా టు చేశారు. జైపూర్ మండలం ఇందారం, తాండూర్ మండలం రెబ్బెనపల్లి, దండేపల్లి మండలం గూడెం, జన్నారం మండలం ఇందన్‌పెల్లి వద్ద అంతర్ జిల్లా చెక్ పోస్టులూ ఏర్పాటయ్యాయి.
జిల్లాలో 17 లైసెన్స్‌డ్ తుపాకులు
జిల్లాలో 17 లైసెన్స్‌డ్ తుపాకులున్నాయి. ఎన్నికల సందర్భంగా తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నవారి నుంచి పోలీసులు ఆయుధాలను డిపాజిట్ చేయించుకుంటున్నారు. ఇందులో 11బ్యాంక్ సెక్యూరిటీ సి బ్బంది వద్ద ఉన్నాయి. పోలీసుల ఆదేశాలతో బ్యాంకుల సెక్యూరిటీ అధికారుల వద్ద ఉన్నవి మినహా మిగతావి ఆయా ఠాణాల్లో డిపాజిట్ చేయాలని పోలీసులు హెచ్చరించారు. డిపాజిట్ చేసిన తుపాకులను కమిషనరేట్‌లోని ఆయుధ కారాగారంలోకి తరలించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో లైసెన్స్ గన్ పొందిన వారు ఆయుధాలు తమవద్ద ఉంచుకోవడం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన కిందకే వస్తుందని ఇప్పటికే వారికి ఆదేశాలు జారీ చేశారు.
కౌన్సెలింగ్.. బైండోవర్లు
జిల్లాలో 250 మందిపై రౌడీ షీట్ ఉంది. ఇందులో కొందరు మృతి చెందగా మరి కొందరు మకాం మార్చేశారు. ఇందులో కొందరు సత్ప్రవర్తనతో మెలుగుతుండగా.. కొందరు యథావిధిగా తమ పంథాను కొనసాగిస్తున్నారు. పోలీస్‌స్టేషన్ల వారీగా రౌడీ షీట్ రికార్డ్‌ల ఆధారంగా వారిని గుర్తించి వారు ఎక్కడున్నారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారో? పూర్తి వివరాలు సేకరించే పనిలో ఇప్పటికే నిమగ్నమయ్యారు. వారిపై పూర్తి స్థాయి నిఘాకు ప్రత్యేక యంత్రాంగాన్నే నియమించారు. ఎన్నికల వేళ అల్లరి మూకలను కట్టడి చేసేందుకు బైండోవర్లు చేయాలని సీపీ ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ పార్టీల్లో ఉంటూ గొడవలు సృష్టించే వారి జాబితాను ఇప్పటి కే సిద్ధం చేశారు. గతంలో బైండోవర్లు చేసినవారందరినీ మళ్లీ బైండోవర్ చేయనున్నారు.
● లైసెన్స్‌డ్ పిస్టళ్లు డిపాజిట్ చేయాలని పోలీస్ ఉన్న
● లైసెన్స్‌డ్ పిస్టళ్లు డిపాజిట్ చేయాలని పోలీస్ ఉన్న


