ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం
పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం. ఎన్నిక ల వేళ లైసెన్స్‌డ్ గన్‌లను డిపాజిట్ చేసుకున్నాం. పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాం. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేదు. ఎవరైనా ఓటర్లను ప్ర లోభాలకు గురిచేయడం, భయపెట్టడం లాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది లాంటివి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు నిర్భయంగా, నిష్పక్షపాతంగా వినియోగించుకోవాలి.
– భాస్కర్, మంచిర్యాల డీసీపీ


