పర్వం షురూ..
రెండో విడత
నామినేషన్ల
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం మొదలైంది. బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌లోని ఏడు మండలాల పరిధిలో 114పంచాయతీలుండగా స ర్పంచ్ స్థానానికి 45నామినేషన్లు, 996 వార్డులుండగా 30నామినేషన్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 1, 2 తేదీల్లోనూ నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. రెండోవిడత ఎన్నికలు నిర్వహించనున్న ఏడు మండలాల పరిధిలో 1,39,312 మంది ఓటర్లున్నారు. వీరిలో 69,249 మంది పురుషులు, 70,055 మంది మహిళలు, ఎనిమిది మంది ఇతరులున్నారు.
మిగతా ప్రక్రియ ఇలా..
రెండో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఈ నెల 3న నామినేషన్ల పరిశీలన, 4న అభ్యంతరాల స్వీకరణ, 5న అభ్యంతరాల పరిశీలన ఉంటుంది. 6న నామినేషన్ల ఉపసంహరణ అనంత రం బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు. 14న ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి అదేరోజు మధ్యాహ్నం 2నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తారు. అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తి చేస్తారు.


