నేటి నుంచి కొత్త వైన్స్‌షాపులు ప్రారంభం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలోని లిక్కర్ గోదాము వద్ద రెండు రోజులుగా సందడి కనిపిస్తోంది. డిసెంబర్ 1నుంచి నూతన మద్యం దుకాణాలు ప్రారంభం కానుండగా లైసెన్స్ పొందిన వారు కొత్త మద్యం పాలసీ మేరకు సోమవారం నుంచి షాపులు ప్రారంభించనున్నారు. గుడిపేట లిక్కర్ గోదాం పరిధిలో 135 షాపులుండగా ఇందులో మంచిర్యాలకు జిల్లా కు చెందిన 73 దుకాణాలున్నాయి. ఇక ఈ గుడిపేట లిక్కర్ గోదాము నుంచి మంచిర్యాల జిల్లాతో పా టు పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, మంథని, భూపాలపల్లి జిల్లాలోని కాటారం, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి ప్రాంతాల్లోని వైన్స్‌షాపులకు ఇక్కడి నుంచి నిల్వలు సరఫరా చేస్తారు. సోమవారం నుంచి నూతన మద్యం దుకాణాలు తెరుచుకోనుండగా రెండు రోజుల నుంచి లిక్కర్ నిల్వలు సరఫరా చేస్తున్నారు. డిపోకు వస్తున్న ఇండెంట్‌ల ఆధారంగా ఒక్కో దుకాణానికి మద్యాన్ని కేటాయిస్తున్నారు. రెండు రోజుల్లో కొత్త మద్యం దుకాణాలకు ఇప్పటివరకు దాదాపుగా 20వేల కేసులకు పైగా లిక్కర్, 18వేలకు పైగా బీరు కేసులు సరఫరా జరిగినట్లు స మాచారం. నూతన మద్యం దుకాణాలకు పూర్తి స్థా యిలో మద్యం నిల్వలు సరఫరా చేసేలా పకడ్బందీ చర్యలు చేపడుతుండగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాస్‌రావు తెలిపారు. కాగా, గుడిపేట లిక్క ర్ గోదాము ఎదురుగా ఏర్పాటు చేసిన వివిధ లిక్క ర్ కంపెనీల స్వాగత ఫ్లెక్సీలు ఆకర్షణగా నిలిచాయి.


