ఇష్టపడి చదివితేనే విజయం
మంచిర్యాలఅర్బన్: ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని అదనపు కలెక్టర్ చంద్రయ్య పేర్కొన్నారు. ఆదివారం స్థానిక షెడ్యూల్ కులాల కళాశాల బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆయన మా ట్లాడుతూ.. ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని సాధించాల ని, మంచి స్థానంలో స్థిరపడాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వసతిగృహ కిచెన్, స్టోర్ గదులు పరిశీలించారు. అధికారులు దుర్గాప్రసాద్, ధర్మానంద్‌గౌడ్, చందన తదితరులు పాల్గొన్నారు.
జైపూర్: మండలంలోని గంగిపల్లి, షెట్‌పల్లి, కుందారం, నర్సింగాపూర్ తదితర గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి ఇ బ్బందులు తెలుసుకున్నారు. తేమశాతాన్ని బట్టి వెంటవెంటనే కొనుగోలు చేయాలని సిబ్బందికి సూ చించారు. డీపీఎం సారయ్య, ఏపీఎం సంతోష్‌కుమార్, కేంద్రాల నిర్వహకులు, ఐకేపీ సీసీలున్నారు.


