బకాయిలు చెల్లించాలి
మంచిర్యాలటౌన్: ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, ఐదు డీఏలు వెంటనే చెల్లించా లని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించా లని పోరాటం చేయాలని తీర్మానించినట్లు టీఎ న్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి తె లిపారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్‌లో ఆదివారం టీఎన్జీవోస్ జిల్లా కార్యవర్గ స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ హరి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరి ష్కారానికి పోరాటం, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, బెనిఫిట్స్ ప్రభుత్వం అందించేలా చూడాలని రాష్ట్ర కార్యవర్గానికి ఏకగ్రీవ తీర్మా నం చేసి పంపినట్లు తెలిపారు. జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీశ్‌కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కేజియారాణి, రాంకుమార్, తిరుపతి, అంజయ్య, శ్రీధర్‌రావు, శివప్రసాద్, సంయుక్త కార్యదర్శులు సునీత, ప్రభు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రావణ్‌కుమార్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు గోపాల్, కార్యదర్శి అజయ్‌ప్రశాంత్ పాల్గొన్నారు.


