నియమావళి పాటించాలి
బెల్లంపల్లిరూరల్: ఎన్నికల నియమావళిని పా టించాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ సూ చించారు. మండలంలోని గురిజాల గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసి న నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ దాఖ లు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు అవగాహ న కల్పించారు. కేంద్రాల వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణ, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భీమిని: కన్నెపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ మనోజ్ పరిశీలించారు. తహసీల్దార్ రాంచందర్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.
నెన్నెల: మండలంలోని నెన్నెల, నందులపల్లి గ్రామాల్లోని నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సబ్ కలెక్టర్ మనోజ్ సందర్శించారు. విధులు బాధ్యతలపై అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీవో అబ్దుల్‌హై, ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో నరేశ్ తదితరులున్నారు.
వేమనపల్లి: మండలంలోని జిల్లెడ క్లస్టర్ నా మినేషన్ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ మనోజ్‌కుమా ర్ సందర్శించారు. ఎంపీవో వెంకటేశ్, ఆర్‌ఐ ఖాలిక్, పంచాయితీ సిబ్బంది ఉన్నారు.


