విత్తనచట్టంపై అభిప్రాయ సేకరణ
మంచిర్యాలఅగ్రికల్చర్: కేంద్ర ప్రభుత్వం పాత విత్తన చట్టాన్ని మార్చి నూతన విత్తన చట్టాన్ని తీసుకురావడానికి రైతుల అభిప్రాయాన్ని సేకరిస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఎర్పాటు చేసిన అభిప్రాయ సేకరణపై జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, బెల్లంపల్లి కేవీకే శాస్త్రవేత్త మహేశ్‌తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నూతన విత్తన చట్టం–2025 ముసాయిదాపై అందరి భాగస్వామ్యంతో అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. రైతుల అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వనికి నివేదిక అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ, ఏవో, ఏఈవోలు పాల్గొన్నారు.


