● రాష్ట్ర స్థాయికి ప్రతిపాదన ● త్వరలో తనిఖీ బృందాల సందర
‘స్వచ్ఛ’ అవార్డుకు ఎనిమిది స్కూళ్లు ఎంపిక
మంచిర్యాలఅర్బన్: స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రాష్ట్ర స్థాయి అవార్డుకు జిల్లాలోని ఎనిమిది పాఠశాలలను ఎంపిక చేశారు. సమగ్ర విద్య జిల్లా స్థాయిలో స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ స్క్రీనింగ్ కోసం కలెక్టర్ చైర్మన్‌గా కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా రిజిష్టర్ చేసుకున్న 908 పాఠశాలలను జిల్లా స్థాయి తనిఖీ బృందాలు క్షుణ్ణంగా పరిశీలించారు. వీటిలో ఏడు ప్రభుత్వ, ఒక ప్రైవేటు పాఠశాలలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయగా.. అర్బన్ 2, రూరల్ 6 పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలలను రాష్ట్ర కమిటీ తనిఖీ బృందం త్వరలో సందర్శించనుంది.
పాఠశాలలు ఇవే..
రాష్ట్ర స్థాయికి ఎంపికై న పాఠశాలల వివరాలను డీఈవో యాదయ్య శనివారం ప్రకటించారు. అర్బన్ కేటగిరీలో ఎయిడెడ్ సింగరేణి కాలరీస్ పబ్లిక్ స్కూల్ కల్యాణిఖని, కేటగిరి 2లో కేంద్రియ విద్యాలయం మంచిర్యాల, రూరల్‌లో కేటగిరి–1 నుంచి ఎంపీపీఎస్ రసూల్‌పల్లి, జైపూర్ ఎంపీపీఎస్ మాలగురిజాల బెల్లంపల్లి, స్లేట్ స్కూల్ జన్నారం, కేటగిరి–2లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందారం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కిష్టాపూర్ జన్నారం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీల్వాయి వేమనపల్లి ఎంపిక య్యాయి. ఎస్‌హెచ్‌వీఆర్ కార్యక్రమంలో భాగంగా అప్‌లోడ్ చేసిన వివరాలు, చిత్రాలను బృందం తనిఖీ చేసింది. 5 స్టార్, 4స్టార్ పాఠశాలలో అప్‌లోడ్ చేసిన వివరాలు నిర్ధారించాయి. ఆయా స్కూల్ క్లాంపెక్స్ పరిధిలో కాంప్లెక్స్ హెచ్‌ఎం, సహాయకుడితో క్షేత్రస్థాయిలో పాఠశాలలను పరిశీలించి రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ప్రతీ రాష్ట్రం నుంచి 20 పాఠశాలలను జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నారు. జాతీయ స్థాయిలో మొత్తం 200 పాఠశాలలను ఎంపిక చేసి రూ.లక్ష స్కూల్ గ్రాంట్‌గా ఇవ్వనున్నారు. పాఠశాల ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు ఎక్స్‌ఫోజర్ విజిట్(క్షేత్రసందర్శన)కు తీసుకెళ్తారు.
పరిశీలించిన అంశాలు ఇవీ..
నీటి లభ్యత, నాణ్యత, వర్షపు నీటి నిల్వకు చర్యలు, మరుగుదొడ్లు, పనితీరు, రక్షణ చర్యలు, చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బు వినియోగం, అవగాహన కార్యక్రమాలు, పాఠశాలల నిర్వహణ, వ్యర్థాల విసర్జన, ఆస్తుల సంరక్షణ, సోలార్ వినియోగం, ఎకో క్లబ్‌లు, పరివర్తన మార్పులపై అవగాహన సదస్సులు, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, నీటి సంరక్షణ పథకాలు అమలు తీరుపై పలు అంశాలను పరిశీలించారు.


