ఓసీ ఏర్పాటుతో ఇబ్బందులు ఉండవు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్‌లో ఓపెన్‌కాస్ట్ ఫేజ్–2 రాకతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని మందమర్రి జీఎం రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఆర్‌కే4 గడ్డ ప్రాంత ప్రజలు శనివారం సాయంత్రం జీఎంను తన ఛాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఓసీ మ్యాప్ చూపెడుతూ గని ఎక్కడి నుంచి ఎక్కడికి ఏర్పాటు కానుందో వివరించారు. దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. పాత గనులు కలుపుతూ ఏర్పాటు అవుతుందని ఏ ఒక్కరికి నష్టం లేదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల్లోనూ స్థానికులకే ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. ఎస్‌ఓటు జీఎం ప్రసాద్, డీజీఎం పర్సనల్ అశోక్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి అక్బర్‌అలీ తదితరులు పాల్గొన్నారు.


