పల్లెల్లో చెరగని ముద్ర
గ్రామాలు ప్రగతిపథంలో తీసుకెళ్లాలనే లక్ష్యం.. ప్రజల మద్దతు, సహకారంతో ఒకప్పుడు పంచాయతీల ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేవి. సర్పంచులు తమ పదవీకాలంలో సీసీరోడ్లు, డ్రెయినేజీలు నిర్మించడం, పేదలకు ఇళ్లు కట్టించడం, ప్రజలకు సేవలందించారు. పల్లెల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తమదైన చెరగని ముద్రవేశారు. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్న సర్పంచులపై సాక్షి ప్రత్యేక కథనం.
ఐదు పర్యాయాలు ఏకగ్రీవం
తాంసి: ఈయన పేరు జింక జైహింద్. తాంసి సర్పంచ్‌గా 25 ఏళ్ల పాటు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చదువు అంతంతే అయినే యువకుడి ఉన్నప్పుడు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్నారు. 1975 నుంచి 2001 వరకు ఐదు పర్యాయాలు 25 ఏళ్ల పాటు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. గ్రామాభివృద్ధికి కృషి చేశారు. 40 కుటుంబాలకు ఇళ్లు నిర్మించడం, గ్రామస్తుల సహకారంతో పాఠశాల, కళాశాలకు స్థలం కేటాయించారు. మరో ఐదేళ్ల పాటు సర్పంచ్‌గా ఉండాలని ప్రజలు కోరిన స్వచ్ఛందంగా వద్దనుకుని వేరేవారికి అవకాశమిచ్చారు. గ్రామం చివరలో చాయ్ హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. అనారోగ్యంతో 2022 ఆగస్టులో మృతిచెందాడు. ఆయన మంచితనం, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తాంసితోపాటు చుట్టూపక్కల గ్రామాల ప్రజలు ఇప్పటికి చెబుతుంటారు.
పల్లెల్లో చెరగని ముద్ర
పల్లెల్లో చెరగని ముద్ర


