ఇంటి స్థలం కోసం టవరెక్కి నిరసన
జైపూర్: మండల కేంద్రానికి చెందిన అహ్మద్ అనే యువకుడు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం స్థ లం కేటాయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సె ల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. తనకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ సరిపడా స్థలం లేక ఇంటి నిర్మాణం నిలిచిపోయిందని వాపోయాడు. స్థలం కే టాయించాలని టవర్ ఎక్కి నిరసన తెలుపగా స్థాని కంగా కలకలం రేపింది. దీంతో ఘటనా స్థలానికి ఎస్సై శ్రీధర్ చేరుకుని యువకుడితో మాట్లాడారు. అతనికి నచ్చజెప్పడంతో అహ్మద్ సెల్ టవర్ పైనుంచి కిందకు దిగాడు. ఎస్సై మాట్లాడుతూ.. అహ్మద్‌ది నిరుపేద కుటుంబమని, ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినా ఉన్న కొద్ది స్థలంలో ఇల్లు నిర్మించకపోవడంతో హోల్డ్‌లో పెట్టారని తెలి పారు. ఇంటి ని ర్మాణానికి స్థ లం కేటాయించి ఆదుకోవాల ని కోరారు.


