తాగిన మైకంలో ఒకరి ఆత్మహత్య
ఉట్నూర్‌రూరల్: తాగిన మైకంలో ఒకరు ఆత్మహ త్య చేసుకున్న ఘటన మండలంలోని పాత ఉట్నూర్‌లో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాత ఉట్నూర్‌లో నివాసముండే రా థోడ్ నూర్సింగ్ (63) మద్యానికి బానిసయ్యాడు. మద్యం సేవించి తరచూ కుటుంబ సభ్యులతో గొ డవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి మద్యం సేవించి వచ్చి గొడవకు దిగాడు. కుటుంబ సభ్యులు సర్ధి చెబుతుండగా అకస్మాత్తుగా కింద పడ్డాడు. ఈ సమయంలో అతడి తలకు దెబ్బ తగలగా ఆస్పత్రికి వెళ్తామని చె ప్పినా వినలేదు. ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఇంటిలోని గది లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన స్థానిక ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలి పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


