మేమున్నామనీ..
మంచిర్యాలక్రైం: మహిళలకు భద్రత కల్పించడంలో షీ టీమ్స్ సఫలమవుతున్నాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో వీటి పనితీరు ఈ ఏడాది బాగుంది. షీ టీమ్స్ ని రంతరం గస్తీ నిర్వహిస్తూ అతివలకు భరోసా క ల్పిస్తున్నాయి. విద్యాసంస్థలు, రైల్వేస్టేషన్‌లు, బ స్టాండ్‌లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతా ల్లో పోలీసులు మఫ్టీలో ఉంటూ ఆకతాయిల భర తం పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, విద్యాసంస్థల్లో ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, ప్రేమ పేరుతో వేధింపులకు గురవుతున్న విద్యార్థినులు, మహిళలకు షీ టీమ్స్ అండగా ఉంటూ పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తున్నాయి. మహిళల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బృందాల్లోని పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ భరోసా కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లోనే కాకుండా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి ఈవ్ టీజర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. స్పై కెమెరాలు వినియోగిస్తున్నారు. అవసరమనుకుంటే పరిసర ప్రాంతాలను వీడియో రికార్డు చేస్తున్నారు. సరైన ఆధారాలతో పోకిరీలను అదుపులోకి తీసుకుని ఈవ్‌టీజింగ్, మహిిళలను వేధించిన కేసులో పట్టుబడిన వారికి పోలీస్ పద్ధతిలో వారి చేష్టలను కుటుంబ సభ్యులకు చూపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తు్‌ాన్నరు. మహిళలను బహిరంగంగా వే ధించడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా వే ధించేవారి తాట తీస్తున్నారు. వీరు చేసిన ఆపరేష న్స్, నిర్వహించిన అవగాహన సదస్సులు మహిళల భద్రతకు రక్షణ కవచంగా నిలుస్తున్నాయి.
మహిళలు, బాలికలను వేధించినా..
మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేసినట్లు రుజువైతే చట్టపరమైన శిక్షలతో పాటు విద్యాపరంగా శిక్షలుంటాయి. విద్యాలయాలనుంచి తాత్కాలి కంగా లేదా శాశ్వతంగా తొలగించడానికి, ఏ ఇతర విద్యాలయాల్లో ప్రవేశాలు లేకుండా చేసేందుకు అ వకాశముంది. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేకుండా చేయడం, పాస్‌పోర్టు జారీ చేయకుండా చర్యలు తీసుకోవచ్చు. యూజీసీ విధానాల ప్రకారం ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన వారి ఉపకారవేతనా లు నిలిపివేయడం, పోటీ పరీక్షలకు హాజరుకాకుండా చేయడం, ఫలితాల నిలిపివేత, రూ.2.50 లక్షల వరకు జరిమానా విధించే ఛాన్స్ ఉంది. పోక్సో కేసులో పిల్లలకు రక్షణ కల్పించేందు ప్రభుత్వం 2012 లో పోక్సో చట్టాన్ని రూపొందించింది. చట్టంలో పే ర్కొన్న మేరకు బాలిక ఆమోదం తెలిపినా, తెలుపకపోయినా బీఎన్‌ఎస్ 63 ప్రకారం 18ఏళ్లలోపు వారి పై లైంగిక కలయిక జరిగితే అది అత్యాచారంగానే పరిగణించబడుతుంది. పిల్లలపై లైంగికదాడికి పా ల్పడితే ఏడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష, జరిమానా, లేదా జీవిత ఖైదు కూడా విధించవచ్చు.
జిల్లా ఫిర్యాదులు ఎఫ్‌ఐఆర్ కౌన్సిలింగ్ అవగాహన రెడ్‌హ్యాండెడ్‌గా
సదస్సులు పట్టుకున్నవి
మంచిర్యాల 210 22 188 285 148
ఆదిలాబాద్ 217 25 192 190 43
ఆసిఫాబాద్ 142 37 105 206 63
నిర్మల్ 30 14 88 115 276
సమాచారం ఇవ్వడం ఇలా..
వేధింపులకు గురైనవారిలో చాలామంది పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు భయపడతారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని పోలీస్‌శాఖ వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక నంబర్లను అందుబాటులో ఉంచింది. ఫోన్‌లో సమాచారం ఇచ్చేందుకు ‘డయల్ 100’కు ఫోన్ చేసి సమాచారం అందించాలి.6303923700 నంబర్‌కు వాట్సాప్ మెస్సేజ్ చేయవచ్చు. క్యూ ఆర్‌కోడ్, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతారు కాబట్టి నిర్భయంగా సమాచారం అందించవచ్చు. షీటీమ్ బృందాలు ఘటనా స్థలానికి రహస్యంగా చేరుకుని సమస్య పరిష్కరిస్తారు.
ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు షీ టీమ్ కేసుల వివరాలు


