మిస్టరీగా బాలిక మరణం
దండేపల్లి: మండలంలోని నంబాల గ్రామానికి చెందిన శనిగారపు మహన్విత (7) మృతి మిస్టరీగా మారింది. ఆడుకోవడానికి వెళ్లిన బాలిక సోమవారం అదృశ్యం కావడం.. మూడు రోజు ల తర్వాత గురువారం బావిలో శవమై తేలడం తెలిసిందే. బాలిక మృతదేహం లభించిన బావి ఇంటి నుంచి దూరంగా ఉంది. బాలిక ఒక్కరే అంతదూరం ఒంటరిగా వెళ్లలేని విధంగా పరిస ర ప్రాంతాలున్నాయి. దీంతో ఎవరైనా హత్య చేసి బావిలో పడేసి ఉండొచ్చని, మరోవైపు చి న్నారిని లైంగిక వేధింపులకు గురి చేసి చంపి ఉంటారనే అనుమానాలూ వ్యక్తమవుతున్నా యి. బాలిక అదృశ్యమైన రోజు పోలీస్ డాగ్‌స్క్వాడ్ ఇంటివద్దే కొద్దిసేపు సంచరించాయి. మృతదేహం లభించిన రోజు మాత్రం డాగ్‌స్క్వాడ్ బా వి నుంచి ఇంటి వద్దకు వచ్చాయి. బాలిక మృతి పై గ్రామంలో పలు విధాలుగా చర్చ జరుగుతోంది. పోస్టుమార్టం నివేదిక వస్తే గానీ మరణానికి కారణాలేమిటనేది చెప్పలేమని పోలీసులు పేర్కొంటున్నారు. మృతదేహం నీళ్లలో ఎ క్కువ రోజులు ఉండడంతో కారణాలు కనుగొ నడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
బంధువుల ఆందోళన
బాలిక మృతిపై న్యాయం చేయాలని తల్లిదండ్రులు, బంధువులు గ్రామస్తులు వంద మందికిపైగా శుక్రవారం దండేపల్లి పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చారు. స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు ప్రయత్నం చేశారు. మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చే శారు. ఇదే సమయంలో కేసు విచారణలో భా గంగా దండేపల్లి స్టేషన్‌కు వచ్చిన ఏసీపీ ప్రకాశ్, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి వెంటనే బయట కు వచ్చి బాలిక తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడారు. బాలిక కుటుంబానికి న్యాయం చే స్తామని, పోస్టుమార్టం నివేదిక రాగానే దాని ఆ ధారంగా నిందితులపై కేసు నమోదు చేస్తామన్నారు. జైలుకు పంపించి శిక్షపడేలా చూస్తామని భరోసానివ్వడంతో వారు వెళ్లిపోయారు.
పోలీసు విచారణ ముమ్మరం
పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు న మోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఏసీపీ ప్రకాశ్ స్వయంగా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహసీనొద్దీన్, లక్సెట్టిపేట ఎ స్సై సురేష్ పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకోగా.. విచారణ వేగవంతం చేశారు.


