హిల్ట్ పాలసీపై బహిరంగ చర్చకు సిద్ధమా?
నిర్మల్‌చైన్‌గేట్: హిల్ట్ పాలసీ అత్యంత పారదర్శకంగా ఉందని, ఎలాంటి కుంభకోణానికి ఆస్కారం లే దంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి బహిరంగ చ ర్చకు సిద్ధమా.. అని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. ఓపెన్ డిబేట్‌కు మంత్రి సిద్ధపడితే శనివారం ఉదయం 11గంటలకు అసెంబ్లీ మీ డియా పాయింట్ వద్దకు జర్నలిస్టుల సమక్షంలో చ ర్చకు రావాలన్నారు. లేదంటే డేట్, టై మ్, వేదికను మంత్రి ఖరారు చేసినా తనకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ ప్రతిపక్షాలకు అర్థం కాలేదని మంత్రి మాట్లాడడం సరికాదన్నారు. ప్రభుత్వ విధానంలో పారదర్శకత ఉంటే, దానిపై చర్చించేందుకు అసెంబ్లీని ఎందుకు సమావేశపరచడం లేద ని, పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించినవి రూ.6.30 లక్షల కోట్లయితే రూ.5వేల కోట్లకే కట్టబెట్టడం కుంభకోణం కాదా? అని ప్రశ్నించారు. ఈ భూ కుంభకోణంలో మంత్రితోపాటు మొత్తం కేబినె ట్, కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలకు వాటా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ ల్యాండ్ కన్వర్షన్ పేరు చెప్పి ల్యాండ్ లూటీకి పాల్పడుతోందన్నారు.


