కుష్ఠువ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
మంచిర్యాలటౌన్: కుష్ఠువ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్‌బాబు అన్నారు. జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు, జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమాలపై శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో వైద్యులు, నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డాక్టర్ జాన్‌బాబు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 87 కుష్ఠువ్యాధి కేసులు నమోదు అయ్యాయని, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించి, మందులు వాడేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అనిత, ప్రోగ్రాం ఆఫీసర్ ఏ.ప్రసాద్, జిల్లా ఉప వైద్యాధికారి సుధాకర్‌నాయక్, డీపీఎంవో రాఘవయ్య, చారి, సకలరెడ్డి, డీపీవో ప్రశాంతి పాల్గొన్నారు.


