ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
జైపూర్: ప్రశాంత వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి సందర్శించారు. నర్వ, శివ్వారం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు, వసతులు పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో జైపూర్, భీమారం, శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్ల సిబ్బందికి ఎన్నికల నియమావళిపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని అన్నారు. డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు నవీన్‌కుమార్, శ్రీలత, ఎస్సైలు శ్రీధర్, సంతోశ్, శ్వేత, తదితరులు పాల్గొన్నారు.


