పూలే ఆశయ సాధనకు పాటుపడాలి
పాతమంచిర్యాల: సమాజంలోని నిమ్న వర్గాల న్యాయమైన హక్కుల కోసం సామాజిక న్యాయ పోరాటం చేసిన మహాత్మా జ్యోతిభా పూలే ఆశయసాధనకు అందరూ పాటుపడాలని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పూలే భవన్‌లో మహాత్మాజ్యోతిభా పూలే 135వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ పూలే పోరాటాల ఫలితంగానే నేడు బడుగు బలహీన వర్గాల ప్రజలు సమాజంలో గౌరవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి కనికరపు రాజన్న, సామాజిక న్యాయవేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ మేధావుల ఫోరం జిల్లా కో అర్డినేటర్ కొండయ్య, డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి దేవి పోచన్న తదితరులు పాల్గొన్నారు.


