శాస్త్రవేత్తల చేతుల్లో దేశ భవిష్యత్
నస్పూర్: దేశ భవిష్యత్ శాస్త్రవేత్తల చేతుల్లో ఉందని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. నగరంలోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో బుధవారం ప్రారంభమైన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ అవార్డుల కార్యక్రమం శుక్రవారం ముగిసింది. విజేతలకు అదనపు కలెక్టర్ చంద్రయ్య బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ ఇన్‌స్పైర్‌లో పాల్గొన్న ప్రతీ విద్యార్థి ఒక జూనియర్ శాస్త్రవేత్త అని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. అంతకుముందు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డీఈఓ యాద య్య, జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్, ఎంఈఓ పద్మజ, ట్రస్మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి, నస్పూర్ పట్టణ అధ్యక్షుడు మైదం రామకృష్ణ, నాయకులు రామకృష్ణరెడ్డి, ఉపేందర్, దేవయ్య, సతీష్‌రెడ్డి, సిద్దయ్య పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయికి ఇన్‌స్పైర్ పోటీలకు ఎంపికైన విద్యార్థులు
ఉత్తమ ప్రాజెక్టులు ప్రదర్శించిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఫర్హజ్(బెల్లంపల్లి), కారెంగుల కీర్తన(భీమిని), జిల్లపల్లి అభిరామ్(చెన్నూర్), లవుడ్య అక్షర(జన్నారం), సహిస్త(దేవాపూర్), కామెర సాయితేజ(కాసిపేట), టేకుమట్ల హరిప్రియ(మంచిర్యాల), శ్రీరాంబట్ల సాయి విగ్నేష్(మంచిర్యాల), మెడం అశ్విత్ వర్మ(మంచిర్యాల), గొల్లపల్లి శ్రీసాన్వి(మందమర్రి), గంగిసెట్టి ప్రశాంత్ జీవన్(రామకృష్ణాపూర్), టీఎల్టీ(టీచర్ లెర్నింగ్ మెటీరియల్)లో ఇద్దరు ఉపాధ్యాయులు గంప శ్రీనివాస్(కాసిపేట), ఇ.మల్లేశ్(మందమర్రి), సెమినార్‌లో ఇద్దరు విద్యార్థులు మంతెన అభిగ్న(కలమడుగు), శాన్వి లక్ష్మి(తాండూర్) వీరితోపాటు డీఎల్‌బీవీలో మరో 28 మంది విద్యార్థులు రాష్టస్థాయి పోటీలకు ఎంపికయ్యారని నిర్వాహకులు తెలిపారు.


