ఘనంగా దుర్గామాత పూజలు
కాసిపేట: మందమర్రి ఏరియా కాసిపేట గనిపై శుక్రవారం ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మైసమ్మతల్లి(దుర్గామాత) పూజలు ఘనంగా నిర్వహించారు. అధికారులు, కార్మిక దంపతులు హోమం, ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్య అతిథిగా మందమర్రి జీఎం రాధాకృష్ణ హాజరై పూజల్లో పాల్గొన్నారు. అధికారులు, రాజకీయ పార్టీ, కార్మిక సంఘాల నాయకులు తరలిరావడంతో గని ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారుల నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఏజెంట్ రాంబాబు, వివిధ గనుల మేనేజర్లు మేనేజర్ సతీష్, అల్లావుద్దీన్, సునిల్‌కుమార్, డెప్యూటీ మేనేజర్ నిఖిల్ అయ్యర్, హెచ్‌ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్, సీఐటీయూ నాయకుడు రాజిరెడ్డి, టీబీజీకేఎస్ నాయకుడు మేడిపల్లి సంపత్, ఐఎన్‌టీయూసీ నాయకుడు బన్న లక్ష్మణ్‌దాస్, మల్లేష్ పాల్గొన్నారు.


