‘గెలుపే లక్ష్యంగా పని చేయాలి’
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/లక్సెట్టిపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచే అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పిలుపుని చ్చారు. బుధవారం హాజీపూర్‌లో, లక్సెట్టిపేట మండలం ఎస్పీఆర్ ఫంక్షన్ హాలులో లక్సెట్టిపేట, దండేపల్లి బీఆర్‌ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని, పంచాయతీల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజల మధ్య ఎండగడుతూ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. హాజీపూర్‌లో మాధవరపు రామారావుకు పార్టీ కండువా కప్పి బీ ఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజిత్‌రావు, మొగిళి శ్రీనివాస్, గాదె సత్యం, పల్లె భూమేశ్, సాగి వెంకటేశ్వర్‌రావు, మందపల్లి శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌లో చేరిక
దండేపల్లి: మండల కేంద్రానికి చెందిన బొలిశెట్టి సిద్దార్థ బుధవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు సమక్షంలో పార్టీలో చేరిన ఆయనకు కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


