ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
కాసిపేట: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా చేపట్టిన ఘటన బుధవారం మండలంలోని సోమగూడం భరత్ కాలనీలో చోటు చేసుకుంది. యువతికి మహిళా సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా బాధిత యువతి అనూష మాట్లాడుతూ సోమగూడెంకు చెందిన సింగరేణి కార్మికుడు షేక్ సలీం, తాను ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నామని, ఇప్పుడు పెళ్లికి పెళ్లికి నిరాకరించడంతో గతంలో పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టగా జైలుశిక్ష అనుభవించినా మార్పు రాలేదంది. ఈ నెల 29న మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేసుకోవడంతో ఆందోళనకు దిగినట్లు పేర్కొంది. సదరు యువకుడి కుటుంబ సభ్యులు కూడా గొడవకు దిగడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. విషయం తెలుసుకున్న సీఐ ఇరువర్గాలను స్టేషన్‌కు తరలించారు. గతంలో కేసు అయినందున కోర్టులో చూసుకోవాలని ఇన్‌చార్జి ఎస్సై రవీందర్ నచ్చజెప్పి పంపించారు. కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘం నాయకురాళ్లు భవాని, కామెర అనూష, తదితరులు పాల్గొన్నారు.


