చోరీ కేసులో నిందితుడి అరెస్టు
మందమర్రిరూరల్: పట్టణంలోని రామన్ కాలనీలో గల ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ఈ నెల 24న జరిగిన చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ శశిధర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్‌షిప్‌కు చెందిన కంది రవి (సింగరేణి కార్మికుడు) కొద్ది రోజులుగా మద్యానికి బానిస్సై జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఆలయంలో హుండీని పగులగొట్టి అందులోని రూ.2,950 నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. టోల్‌గేట్ సమీపంలో నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ. 2,450 రికవరీ చేసినట్లు తెలిపారు. ఎస్సై రాజశేఖర్‌తో పాటు, సిబ్బందిని సీఐ అభినందించారు.


