ఎంజేపీ కళాశాలలో విచారణ
ఇచ్చోడ: మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రిన్సిపాల్ నారాయణ విద్యార్థులపై వేధింపులకు పాల్పడుతున్నాడని మంగళవారం అంబేడ్కర్ చౌరస్తాలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. బుధవారం ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, ఉమ్మడి జిల్లా ఆర్సీవో శ్రీధర్ కళాశాలలో విచారణ చేపట్టారు. విద్యార్థులు, కళాశాల సిబ్బంది, ప్రిన్సిపాల్‌తో వేర్వేరుగా మాట్లాడారు. ప్రిన్సిపాల్ నారాయణపై విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆర్సీవో శ్రీధర్ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్‌ను సెలవులపై పంపించారు. విద్యార్థుల ఆందోళనతో ప్రిన్సిపాల్ నారాయణపై బదిలీ వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.


