ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి పాముకాటు
కైలాస్‌నగర్(బేల): బేల మండలంలోని సిర్సన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదోతరగతి విద్యార్థి అనూష్ పాముకాటుకు గురయ్యాడు. బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విద్యార్థులు క్రికెట్ ఆడుతుండగా బంతి పాఠశాల బయట డ్రెయినేజీలో పడింది. బాలుడు చేతితో బంతిని తీస్తుండగా పాము కాటువేసింది. ఉపాధ్యాయులకు విషయం చెప్పడంతో 108కు సమాచారం అందించారు. ప్రథమ చికిత్సను అందించిన అనంతరం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రాణపాయం తప్పినట్లుగా వైద్యులు తెలి పారు. మండల విద్యాధికారి మహాలక్ష్మి రిమ్స్ కు చేరుకుని విద్యార్థిని పరామర్శించారు.


