ప్రపంచ శాంతికి సైకిల్ యాత్ర
సోన్: ప్రపంచ శాంతి, కాలుష్య రహిత సమాజం కొరకు మహారాష్ట్రలోని పూణేకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు దత్త, బ్యాంకు మేనేజర్ అవినాష్ చౌహాన్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన సైకిల్ యాత్ర బుధవారం మండల కేంద్రానికి చేరుకుంది. ఉపాధ్యాయులు తోడిశెట్టి రవికాంత్, తోడిశెట్టి చంద్రయ్య, పోతుగంటి సాయన్న, మారుపాక శ్రీనివాస్, సేర్పూర్ సత్యనారాయణ గంజాల్ టోల్ ప్లాజా వద్ద వారికి స్వాగతం పలికారు. స్వాగతం పలికినట్లు తెలిపారు. ఈ సందర్భంగా యాత్రికులు మాట్లాడుతూ ఈనెల 12న ప్రారంభమైన యాత్ర 25 రోజుల పాటు కొనసాగుతుందన్నారు.


