అంకోలి పీహెచ్‌సీ సందర్శన
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని అంకోలి పీహెచ్‌సీని బెంగళూరుకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ (ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్) అధికారి డాక్టర్ కే.అభయ్ బుధవారం సందర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండాకాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడదెబ్బ తగలకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలను మండల వైద్యాధికారి డాక్టర్ సర్ఫరాజ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీహెచ్‌సీ ఆవరణలో స్టోర్ రూం, ల్యాబ్, బయోమెడికల్ వేస్టేజ్ పరిశీలించారు. ఆయన వెంట ఎన్‌సీడీ ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్ శ్రీధర్, హెల్త్ సూపర్‌వైజర్లు బొమ్మెత సుభాష్, శ్రీనివాస్, స్టాఫ్ నర్సులు రాజ్యలక్ష్మి, ప్రతిమ, ల్యాబ్ టెక్నీషియన్ పల్లవి, తదితరులు ఉన్నారు.


