అదృశ్యమైన వృద్ధుడి మృతదేహం లభ్యం
భైంసాటౌన్: పట్టణానికి చెందిన శివనాథ్ బచ్చువార్ (76) మృతదేహం బుధవారం లభ్యమైనట్లు పట్టణ ఎస్సై నాగభూషణం యాదవ్ తెలిపారు. శివనాథ్ బచ్చువార్ ఈనెల 23న సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లి ఇంటికి రాలేదు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. వృద్ధుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా బుధవారం నిర్మల్ చౌరస్తాలోని ఎంఎస్ టవర్స్ లిఫ్ట్ సెల్లార్‌లో అతని మృతదేహం లభ్యమైనట్లు చెప్పారు. ఆదివారం సాయంత్రం ఎంఎస్ టవర్స్‌లో బంధువుల ఇంటికి వెళ్లగా లిఫ్ట్ (పనిచేయడం లేదు) ఎక్కే క్రమంలో గమనించక జారి సెల్లార్‌లో పడి మృతి చెందినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియాస్పత్రికి తరలించినట్లు తెలిపారు.


