‘మా ఉపాధ్యాయుడు మాకే కావాలి’
జైనథ్: మా ఉపాధ్యాయుడు మాకే కావాలని మండలంలోని పిప్పల్‌గావ్ గ్రామస్తులు బుధవారం ఎంఈవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. పాఠశాలలో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయుడు తిరుపతిరెడ్డిని డిప్యూటేషన్‌పై కారింజ పాఠశాలకు పంపిస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేయడంతో సదరు ఉపాధ్యాయుడు కారింజ గ్రామంలోని పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుడి డిప్యూటేషన్‌ను వ్యతిరేకిస్తూ పిప్పల్‌గావ్ గ్రామస్తులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారని అందులో ఒకరికి ఆరోగ్యం బాగోలేక సెలవుపై ఉండగా ఉన్న ఒక్క ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై పంపించారన్నారు. మా ఉపాధ్యాయుడిని మాకే పంపించాలని కోరారు.


