రాజ్యాంగ స్ఫూర్తితోనే ఆత్మనిర్బర్ భారత్
మంచిర్యాలటౌన్: అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే ఆత్మనిర్మర్ భారత్ దిశగా భారతదేశం ముందుకు వెళ్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం అంబేడ్కర్ చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దుర్గం అశోక్, పట్టి వెంకటకృష్ణ, ఎనగందుల కృష్ణమూర్తి, పానుగంటి మధు, వైద్య శ్రీధర్, అమిరిశెట్టి రాజ్‌కుమార్, రంగ శ్రీశైలనం, మిట్టపల్లి జయరామరావు, బెల్లంకొండ మురళి, కుర్రె చక్రవర్తి, బింగి సత్యనారాయణ, పవన్ పాల్గొన్నారు.


