మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి
మంచిర్యాలటౌన్: బస్తీదవాఖానాలో మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని హమాలీవాడ బస్తీదవాఖానాలో మహిళల ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని ఆమె పరిశీలించారు. 7,547 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించినట్లు తెలిపారు. మహిళల్లో అసంక్రమణ వ్యాధులు, బీపీ, షుగర్, క్యాన్సర్, రక్తహీనత, రుగ్మతలను గుర్తించి సరైన వైద్యం అందించాలని వైద్యాధికారి డాక్టర్ రమ్యకు సూచించారు.
వ్యాసెక్టమీపై అవగాహన కల్పించాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలో ఈ నెల 21నుంచి డిసెంబర్ 4వరకు వ్యాసెక్టమీపై ప్రజలకు అవగాహనను కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం వ్యాసెక్టమీ అవగాహన కార్యక్రమాల పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వో కాంతారావు, డెమో బుక్క వెంకటేశ్వర్, డీపీహెచ్‌ఎన్ పద్మ, దామోదర్, రాజేశ్వర్, సుమన్, వసుమతి, సురేందర్, ప్రవళిక, భాగ్య పాల్గొన్నారు.


