కాంట్రాక్టు కార్మికుల ఆందోళన
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మికుల రెండు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు నెలలుగా వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్యం బారిన పడ్డ వారి స్థానంలో పనిచేస్తున్న వారి పేర్లు ఎక్కించాలని కోరారు. కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాల్లో కార్మికులకు గ్రామ పంచాయతీల్లో ఇచ్చిన వేతనాలనే ఇస్తున్నారని, సమాన వేతనాలు ఇవ్వాలని కోరారు. సంఘం గౌరవ అధ్యక్షుడు దేవి సత్యం, కోకిల శ్రీనివాస్, ఆవునూరి గోపాల్, దాసరి సుమన్, బరిగెల నవీన చిట్యాల శంకరయ్య, రేగుంట వెంకటి, సత్తయ్య, రాయలింగు, మల్లేశ్, మాడుగుల నవీన్, సిర్ర దుర్గమ్మ, పోసక్క, సుజాత, దుర్గక్క, లావణ్య పాల్గొన్నారు.


