జన్నారం: ఇక నుంచి ఎక్కడ చెట్లు నరికినా బెయిల్ రద్దవుతుందని, ప్రతీ సోమవారం రేంజ్ కార్యాలయంలో హాజరు కావాలని ఇందన్‌పల్లి అటవీ రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. ఇందన్‌పల్లి అటవీ రేంజ్‌లోని కవ్వాల్ సెక్షన్ పాలఘోరీ ప్రాంతంలో అక్రమంగా గుడిసెలు వేసుకుని చెట్లను నరి కి జైలుకెళ్లిన 26 మంది ఆదివాసీ గిరిజనులకు న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూ రు చేయగా.. సోమవారం ఇందన్‌పల్లి రేంజ్ కార్యాలయంలో హాజరయ్యారు. రేంజ్ అధికారి మాట్లాడుతూ బెయిల్ షరతులను వివరించారు. సాక్ష్యాల ను మార్చరాదని, ఏదైనా అటవీ నేరానికి పాల్పడితే కోర్టు ధిక్కరణ కింద తిరిగి జైలుకు వెళ్లాల్సి వస్తుందని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు అనధికార టేకు కలప వాడుకుంటే చర్యలు తీసుకుంటామని, ఫైబర్, రెడీమేడ్ కలప ఉపయోగించుకోవాలని తెలి పారు. సెక్షన్ అధికారి రవి, సిబ్బంది పాల్గొన్నారు.
బాసరలో దొంగ అరెస్ట్
బాసర:బాసర రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్‌లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులతోపాటు ఓ మహిళ అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ముధోల్ సీఐ మల్లేశ్, బాసర ఎస్‌హెచ్‌వో సాయికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులను పరిశీలించగా రూ.లక్ష విలువైన ల్యాప్‌టాప్ దొరికింది. దీనిగురించి ఆరా తీయగా నిజామాబాద్ నుంచి బాసరకు వస్తున్న రైళ్లో దొంగిలించినట్లు తెలిపారు. వివరాలు ఆరా తీసి వారిని, ల్యాప్‌టాప్‌ను రైల్వే పోలీసులకు అప్పగించారు. షేక్ నదీం, అతనితో ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ జీఆర్సీ ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. మధుసూదన్ అనే వ్యక్తి ల్యాప్‌టాప్ పోయినట్లు ఫిర్యాదు చేశాడని వెల్లడించారు.
ఎక్కడ చెట్లు నరికినా బెయిల్ రద్దు


