దద్దరిల్లిన ‘ధర్మయుద్ధం’
చట్ట బద్ధతలేని లంబాడీలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎస్టీ జాబితా నుంచి వెంటనే తొలగించాలి.
1956 నుంచి 1976 వరకు ఎస్టీ జాబితాలో లేకున్నా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొంది ఉద్యోగాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలి.
పేసా చట్టం షెడ్యూల్ ప్రాంతంలో నివాసముంటున్న లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి.
షెడ్యూల్ ప్రాంత ఆదివాసీలు, విద్యావంతులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలి.
పీవీటీజీ ఆదివాసీలకు విద్యాసంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలి.
ఆదివాసీలకు షెడ్యూల్ ప్రాంతంలోని భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు.. ప్రతీ ఉప ఆదివాసీలవారీగా మాత్రమే భూమి క్రయవిక్రయాలు జరగాలి. ఎల్‌టీఆర్ 1970 చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి.
సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న లంబాడీల తొలగింపు కేసు ప్రక్రియకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కౌంటర్ పిటిషన్ తక్షణమే వేసి డిసెంబర్ 9న జరిగే విచారణకు సహకరించాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే ఉద్యోగాలు, ఎస్టీ జాబితాలను తెలంగాణ, ఆంఽధ్రప్రదేశ్ రాష్ట్రాల లంబాడీలను పరిగణనలో తీసుకోరాదు.
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని నాయకుల డిమాండ్ తీర్మానాలు చేసిన ఆదివాసీ పెద్దలు సభకు వేలాదిగా వచ్చిన ఆదివాసీలు
ఉట్నూర్‌రూరల్: చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని ధర్మయుద్ధం సభ నినదించింది. అప్పటిదాకా పోరాటం ఆగదని సభకు హాజరైన ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఇదే డిమాండ్‌తో ఆదివాసీలు ఉట్నూర్‌లోని ఎంపీడీవో గ్రౌండ్‌లో నిర్వహించిన ఆదివాసీ ధర్మయుద్ధం సభ విజయవంతమైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, మహారాష్ట్ర నుంచి తొమ్మిది తెగల ఆదివాసీలు, ఆయా సంఘాల నాయకులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ముందుగా స్థానిక కేబీ కాంప్లెక్స్‌లోని కుమురం భీం విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం తుడుం మోగిస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆదివాసీ మేధావులు ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు.
నాయకులు ఎవరేమన్నారంటే..
ధర్మయుద్ధం సభకు హాజరైన తొమ్మిది తెగల ఆదివాసీ నాయకులు, మేధావులు, పెద్దలు ముందుగా ప్రసంగించారు. రాంజీగోండు, కుమురంభీం, సూరు, ఇతర ఆదివాసీ పోరాట యోధులున్న కాలంలో లంబాడీలు లేరని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లోని లంబాడీలు వేరే కులాల్లో కొనసాగుతుండగా, తెలంగాణలో మాత్రం ఎస్టీలుగా కొనసాగుతున్నారని తెలిపారు. ఆదివాసీలకు కల్పించిన హక్కులు, రిజర్వేషన్లు పొందుతూ అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అన్ని రంగాల్లో ఆదివాసీలు వెనుకబడి ఉన్నారని వాపోయారు. పోరాటాల ద్వారా హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ జాతికి ఎవరూ అన్యాయం చేయొద్దని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సూచించారు. సమాజంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి ఆదివాసీ పెద్దలు, మేధావులు, నాయకులను సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకెళ్తానని తెలిపారు. ఆదివాసీల కోసం పార్టీలకు అతీతంగా పోరాటాలు చేయాల్సిందేనని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సూచించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే లంబాడీలు ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారని, ఇప్పుడు అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సభకు జీసీసీ చైర్మన్ తిరుపతి, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, సభ సమన్వయ కర్త మెస్రం దుర్గు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్, వివిధ సంఘాల నాయకులు నగేశ్, గణేశ్, దాదేరావ్, నాగు, రాజు, జంగు, వెంకట్రావ్, ప్రభాకర్, అశోక్, విఠల్‌రావ్, విజయ్, సంధ్యారాణి, రామారావు, గంగారాం, జైవంత్‌రావ్, పోచయ్య, కనక యాదవ్‌రావ్, పుర్క బాపురావ్, మహారాష్ట్ర ఆదివాసీ నేతలు తిరుమల్ మహా బావుజీ, సువర్ణ వేర్కడే తదితరులు హాజరయ్యారు.
అడుగడుగునా ఆంక్షలు
ఆదివాసీ ధర్మయుద్ధ సభ నేపథ్యంలో ఉట్నూర్ పట్టణంలో బంద్ పాటించారు. పట్టణంలో పో లీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. సభకు వెళ్లేదారులు, అష్టకూడలి, అంబేడ్కర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, ఐటీడీఏ ఏరియా, తెలంగా ణ చౌక్, కేబీ కాంప్లెక్స్, పాత ఉట్నూర్, ఎక్స్ రో డ్డు తదితర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు కొనసాగాయి. ఈ కారణంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్స్ రోడ్డు వద్దకు రావాల్సి న పరిస్థితి నెలకొంది. సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, కరీంనగర్, రామగుండం సీ పీలు గౌస్ ఆలం, అంబర్ కిషోర్ ఝా, ఉట్నూ ర్ ఏఎస్పీ కాజల్‌సింగ్ సభ శాంతియుతంగా సాగేలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సభ తీర్మానాలివే..


