రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో ప్రతిభ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): వరంగల్‌లోని నెల్లికుదురులో ఈనెల 22, 23 తేదీల్లో పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో గుడిపేట ఎంజేపీ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. అండర్–17 విభాగంలో భానుతేజ స్వర్ణ పతకం, వెంకటరమణ రజత పతకం, శ్రీహర్షిత్‌వర్మ కాంస్య పతకం, అండర్–14 విభాగంలో అమన్, ఉదయ్‌కిరణ్, స్నేహిత్, అరవింద్ కాంస్య పతకాలు సాధించారు. ప్రిన్సిపాల్ సేరు శ్రీధర్, పీడీ సురేశ్, పీఈటీ నగేశ్, అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు.


