పత్తి రైతుకు గులాబీ గుబులు
మంచిర్యాలఅగ్రికల్చర్:పత్తికాయ చూస్తే పచ్చగా నిగనిగా కనిపిస్తోంది. కానీ కాయను తెంపి చూస్తే అంత ఖాళీగానే కనిపిస్తోంది. గులాబీ పురుగు కాయను తొలిచేస్తుండడంతో దూది రైతులు అందో ళ చెందుతున్నారు. పంట పచ్చగా, చెట్టు నిండా కాయలతో కనిపిస్తోంది. కానీ కాయపగిలి పత్తి బయటకు రావాల్సి ఉండగా, గుల్లగా మారుతోంది. ఒక్కో కాయను పరిశీలించి గుర్తుపట్టే లోపే జరుగాల్సిన నష్టం జరిగిపోతుందని రైతులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే చాలాచోట్ల పత్తి తీత పనులు కొనసాగుతున్నాయి. ఆలస్యంగా వేసుకున్న పంట కాత దశలో ఉంది. ఈ పంటను గులా బీ పురుగు, లద్దె పురుగులు దెబ్బ తీస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే పత్తి కాయలను మొత్తం తినేస్తున్నాయి. రెండు మూడుసార్లు క్రిమి సంహారక మందులు పిచికారీ చేసినా ప్రయోజనం ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు భారీ వర్షాలు, వరదలో నష్టపోతే, కాత, దిగుబడి దశలో గులాబీ పురుగుతో మరింత నష్టపోతున్నామని రైతులు పేర్కొంటున్నారు.
పత్తి రైతుకు గులాబీ గుబులు


