ఇద్దరు బైండోవర్
జన్నారం: అటవీ ప్రాంతంలో రంపం, జీఐ వైర్‌తో కనిపించిన ఇద్దరిని బైండోవర్ చేసినట్లు తాళ్లపేట్ రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. శుక్రవారం రేంజ్ అధికారి తెలిపిన వివరాల ప్ర కారం విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో పరిశీలించగా తపాలపూర్ గ్రామానికి చెందిన ఏదుల చంద్రయ్య, వొడ్డెపల్లి శ్రీని వాస్‌లు అటవీ ప్రాంతంలో రంపం, జీఐ వైర్, తాళ్లతో పట్టుబడ్డారు. వారిని ఎఫ్‌ఆర్వో సుష్మారావు ఆదేశాల మేరకు డీఆర్వో సాగరిక, ఎఫ్ ఎస్‌వో నహీదా, ఎఫ్‌బీవోలు సాయి, శ్రీ కాంత్‌లు విచారించారు. అనుమానంతో నింది తుల ఇళ్లలో తనిఖీ చేయగా రెండు టేకు దుంగలు ల భ్యమయ్యాయి. దీంతో వారిపై కేసు నమో దు చేసి తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి ఎదుట బైండోవర్ చేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు.
ప్రియురాలి కోసం
సెల్‌టవర్ ఎక్కిన యువకుడు
బెజ్జూర్: ప్రియురాలి కోసం ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి గ్రామంలో గంటపాటు కలకలం రేపాడు. మద్దిగూడ గ్రామానికి చెందిన కోరితే కిష్టయ్య అనే యువకుడు సులుగుపల్లి గ్రామానికి చెందిన యువతితో నాలుగు నెలలుగా ప్రేమలో ఉన్నాడు. అయితే యువతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం సులుగుపల్లి గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి హైడ్రామా సృష్టించాడు. యువకుడు టవర్ పైకి ఎక్కి తన ప్రేమను అంగీకరించకపోతే కిందికి దూకుతానని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై సర్తాజ్ పాషా, సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. యువకుడితో మాట్లాడి కిందికి దింపారు. అనంతరం యువకుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు.
తెగిపడిన విద్యుత్ తీగ
రామకృష్ణాపూర్: పట్టణంలోని తారకరామకాలనీ నుంచి పులిమడుగు వెళ్లే మార్గంలో ఓ ఇంటి ఆవరణలో శుక్రవారం హైటెన్షన్ విద్యుత్ తీగ ఒక్కసారిగా తెగిపడగా పెను ప్రమాదం తప్పింది. 11 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగ తెగి పడి ఇంట్లోని ఇనుప తీగ(దండెం)కు తాకింది. అదే సమయంలో ఇంటి వాకిలి ఊడుస్తున్న రజితకు దండెం తీగ తగలడంతో విద్యుత్ షా క్‌కు గురై కిందపడిపోయింది. విద్యుత్ తీగను స్థానికులు గుర్తించి విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. షాక్‌కు గురైన రజితను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.
దొంగ అరెస్ట్
తలమడుగు: తలమడుగు మండలం ఉండం గ్రామ శివారులో గల పేట పోచమ్మ ఆలయంలో ఈనెల 29వ తేదీన దొంగతనం చేసిన మండలంలోని లాల్‌ఘడ గ్రామానికి చెందిన దోడిసం లచ్చిరాంను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై రాధిక తెలిపారు. నిందితుడు ఈ నెలలోనే తాంసి మండలంలోని దుర్గామాత ఆలయంలోనూ దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు.
ఇద్దరు బైండోవర్


