వంతెన కోసం గిరిజనుల పాదయాత్ర
పెంబి: కడెం వాగుపై వంతెన నిర్మించాలని పలు గిరిజన గ్రామాల ప్రజలు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ మండల పరిధిలోని గిరిజన గ్రామాలు యాపలగడ, దోందారి, వస్పల్లి, చాకిరేవు, సత్తుగడ, రాంనగర్‌లతో పాటు దాదాపు 15 గిరిజన గ్రామాలకు వెళ్లాలంటే కడెం, దోత్తి వాగు దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. వంతెనలు నిర్మించాలని షెట్‌పల్లి గ్రామం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు. టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి తోడసం శంభు, విజయ్, భీంరావు, సోమేశ్, ప్రజలు పాల్గొన్నారు.


