బాసర ఆలయంలో కార్తిక సందడి
బాసర: కార్తికమాసం పురస్కరించుకుని శుక్రవారం బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వేకువజామున ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛరణ మధ్య సరస్వతి, లక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు అభిషేకం, అర్చన, అలంకరణ హా రతి పూజలు నిర్వహించారు. గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి కార్తీకదీపం వదిలి శ్రీ సూరేశ్వర ఆలయంలో పూజలు చేశారు. అనంతరం క్యూ లైన్‌లో వేచి ఉండి తల్లిదండ్రులు చిన్నారులకు అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించి మొ క్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనాదేవి, ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అ మ్మవారి దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. కాగా ఆలయానికి శుక్రవారం అక్షరాభ్యాసాలు, వివిధ అర్జిత సేవలతో మొత్తం రూ.7 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో అంజనా దేవి తెలిపారు.


