పేకాటస్థావరంపై పోలీసుల దాడి
జైనథ్: విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని కంఠ గ్రామంలో శుక్రవారం ఎస్సై గౌ తమ్ పవర్ ఆధ్వర్యంలో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. నిందితులతో పాటు రెండు మొబైల్ ఫోన్లు, రూ.5325 నగదు స్వా ధీ నం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కేసు న మో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉత్తమ సేవలకు పురస్కారం
మంచిర్యాలటౌన్: జిల్లాలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, పైలెట్లుగా ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత పురస్కారాలు అందించారు. ప్రీ హాస్పిటల్ కేర్, బెల్లంపల్లి వాహనంలో సేవలు అందిస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఎం. భూమన్నకు, 108 లక్సెట్టిపే ట్ వాహనం పైలట్లు ఎం. సత్తయ్య, గంగన్న, 102 అమ్మ ఒడి కెప్టెన్ శంకర్‌లు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. కార్యక్రమంలో 108 ఉమ్మ డి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్, మంచిర్యాల 108 అధికారి డి. సంపత్ పాల్గొన్నారు.


