పోలీస్‌స్టేషన్‌లో డీసీపీ తనిఖీ
భీమారం: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ భాస్కర్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల ఫిర్యాదులను ఎలా ఆన్‌లైన్ చేస్తున్నారని పరిశీలించారు. ఎఫ్‌ఆర్‌ఐ కాపీలు పరిశీలించి కేసుల వివరాలపై సీఐని అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చేవారికి మర్యాద ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. గంజాయి అమ్మకాలు చేపట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరోసారి ఆ నేరాలకు పాల్పడకుండా చూడాలని అన్నారు. రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, భీమారం ఇంచార్జి ఎస్సై లక్ష్మిప్రస్సన్న, సిబ్బంది పాల్గొన్నారు.


