డ్రగ్స్ నిర్మూలనకు పోరాటం చేయాలి
పాతమంచిర్యాల: సామాజిక రుగ్మతలకు మూలకారణమైన డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు నిరంతర పోరాటాలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, తెలంగా ణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ భాషా, సాంస్కృతిక, సామాజిక, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు సల హా కమిటీ సభ్యుడు పల్లె నర్సింహ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ‘ఎంజాయి పేరుతో గంజాయి వద్దు’ అనే నినాదంతో సాగుతున్న బస్ కళాజాత కార్యక్రమంలో భాగంగా ప్రదర్శన నిర్వహించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కే.శ్రీని వాస్, సీపీఐ నాయకులు మేకల దాసు, ఖలిందర్ అలీఖాన్, రేగుంట చంద్రశేఖర్, రాజేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.


