ఎస్టీపీపీ సీఎంవోఏఐ ప్రెసిడెంట్‌గా పంతులా
జైపూర్: స్థానిక సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)లో శుక్రవారం సీఎంవోఏ ఐ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఎస్టీపీపీ జీఎం నరసింహారావు, వోఅండ్‌ఎం జీఎం మదన్‌మోహన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఖాళీగా ఉన్న ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రెటరీ పదవులకు నామినేషన్ కోరారు. అధికారుల సంఘం సభ్యులందరూ సీఎంవోఏఐ ఎస్టీపీపీ బ్రాంచ్ ప్రెసిడెంట్‌గా డి.పంతులాను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. వైస్‌ప్రెసిడెంట్‌గా జనగామ శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీగా శ్యామలను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. నూతన కమిటీ సభ్యులు ఎస్టీపీపీ ఈడీ చిరంజీవికి, సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. అంద రి సహకారంతో సెంట్రల్ కమిటీ సభ్యులతో యాజమాన్యాన్ని సమన్వయపర్చుతూ పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.


