జీజీహెచ్ ఇంచార్జి సూపరింటెండెంట్‌గా వేదవ్యాస్
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(జీ జీహెచ్) ఇంచార్జి సూ పరింటెండెంట్‌గా డాక్టర్ వేదవ్యాస్‌ను ని యమించారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడిక ల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఏ.నరేంద్రకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ఇటీవల బదిలీ అయిన విష యం తెలిసిందే. ఆయన స్థానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ వేదవ్యాస్‌కు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు.


