జాతీయ సమైక్యతకు నిదర్శనం ‘సర్దార్’
మంచిర్యాలక్రైం: దేశ ప్రజలందరినీ ఏకతాటి పైకి తీసుకొచ్చి జాతీయ సమైక్యతకు నిదర్శనంగా నిలిచిన మహనీయుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఐబీ చౌరస్తా వరకు రన్ ఫర్ యూనిటీ 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీసీపీ ఏ.భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, జిల్లా క్రీడా యువజ న సర్వీసుల అధికారి హనుమంతరావుతో కలిసి కలెక్టర్ ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంతీయ, సాంస్కృతిక విభేదాలు లేకుండా ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారని కొనియాడారు. భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించారని తెలిపారు. ప్రజలంద రూ ఐక్యతతో ముందుకు సాగితే రాష్ట్రం, దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని, దేశభక్తి, సమైక్యత భా వం ప్రతీ ఒక్కరిలో ఉండాలని అన్నారు. మహనీ యుల ఆశయాలను యువత సమష్టిగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి(జాతీయ ఐక్యత దినోత్సవం) వేడుకలు గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని సమైక్యతను ప్రదర్శించాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం బెటాలియన్ నుంచి గుడిపేట గోదావరి శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరకు 2కే రన్ నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ పి.వెంకటరాములు, అసిస్టెంట్ కమాండెంట్లు నాగేశ్వర్‌రావు, బాలయ్య, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
హాజీపూర్ పోలీసుల ఆధ్వర్యంలో..
హాజీపూర్ పోలీసుల ఆధ్వర్యంలో పటేల్ జయంతి సందర్భంగా 2కే రన్ నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ నుంచి పడ్తనపల్లి, రాంపూర్ విద్యారణ్య ఆవాస వి ద్యాలయం మైదానం వరకు సాగింది. ఎస్సై స్వరూప్‌రాజ్, పోలీస్ సిబ్బంది, వివిధ పార్టీల శ్రేణులు, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రన్‌లో కమాండెంట్ వెంకటరాములు, పోలీస్ అధికారులు
రన్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్ కుమార్‌దీపక్, డీసీపీ భాస్కర్
జాతీయ సమైక్యతకు నిదర్శనం ‘సర్దార్’


