నాణ్యమైన విద్య, సౌకర్యాలు కల్పించాలి
రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ పాఠశాలలు, కళా శాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు క ల్పించి నాణ్యమైన విద్య అందించాలని రాష్ట్ర వి ద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ సంచా లకులు నవీన్ నికోలస్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ అధికారులు తో సమీక్షించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి మా ట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలన్నా రు. ఈ సమావేశంలో కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, డీఈవో యాద య్య, ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య పాల్గొన్నారు.
పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ
కాసిపేట: మండలంలోని కేజీబీవీ, తెలంగాణ మో డల్ స్కూల్, రేగులగూడ, మల్కేపల్లి గిరిజన ఆశ్ర మ పాఠశాలలు, జూనియర్ కళాశాలను కలెక్టర్ కు మార్ దీపక్ శుక్రవారం తనిఖీ చేశారు. వంటశాల, రిజిష్టర్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు పరిశీలించారు. ఎంపీడీవో సత్యనారాయణసింగ్, ఎంపీవో సబ్ధర్ అలీ పాల్గొన్నారు.
పత్తి కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
తాండూర్: పత్తి కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండలంలోని శ్రీరామ, మహేశ్వరి జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు ఏర్పాట్లను తహసీల్దార్ జ్యోత్స్నతో కలిసి పరిశీలించారు. రైతులు తమ వివరాలను కిసాన్ కపాస్ యాప్‌లో నమోదు చేసుకుని స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు రావాలని సూచించారు.


